Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానిక ఎమ్మెల్యేకు సోయి లేదా
- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-భువనగిరి రూరల్
జిల్లా కేంద్రానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తుక్కాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సిద్ధం రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అనుమతులు ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు.ఆదివారం గ్రామంలో వంటావార్పు కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులకు స్వయంగా భోజనం వడ్డించారు.ఇప్పటికే తుక్కాపూర్ గ్రామంలో ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ ద్వారా వాయి కాలుష్యంతో జల కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భంలో గ్యాస్ ఫ్యాక్టరీకి కావలసిన రా మెటీరియల్ కోసం క్వార్జ్ పౌడర్ తయారు చేయడానికి కంపెనీకి అనుమతి ఇవ్వడం సరికాదన్నారు.గ్రామానికి సంబంధించిన జేఏసీ యువకులు ఐదు రోజుల కింద కలెక్టర్‌కు అనుమతులు రద్దు చేయాలని వినతిపత్రం అందజేసినా కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.రిలే నిరాహార దీక్షలకు పూర్తి మద్దతు తెలుపుతూ అవసరమైతే ఉద్యమాన్ని ఉధతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలఅధ్యక్షుడు కోటా పెద్దస్వామి, జిల్లా నాయకులు నుచ్చునాగయ్యయాదవ్, నానం కృష్ణగౌడ్, ఎల్లాంల జంగయ్య యాదవ్, తుక్కాపురం జేఏసీ నాయకులు రత్నపురం శ్రీనివాస్, రత్నపురం సురేందర్, ఏడుకొండిపవీణ్రెడ్డి, కంఠం యాదేశ్, రాసల శ్రీనివాస్, రత్నపురం బాలకృష్ణ, జక్కులఉప్పలయ్య, పుట్ట వీరేష్‌యాదవ్, నల్లమాసు సత్యనారాయణగౌడ్, జక్కుల సత్యనారాయణయాదవ్, ఏడుమేకల మహేష్‌యాదవ్, రాసాల వెంకటేశం, జనగాంసత్తయ్య, ఎడ్ల శ్రీనివాస్, చిక్కులవెంకటేశం పాల్గొన్నారు.