Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ కల్లుగీత కార్మికసంఘం రాష్ట్ర మహాసభలు
- తెలంగాణకల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ.రమణ
నవతెలంగాణ-వలిగొండ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గీత కార్మికులందరికీ గీతన్నబంధు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 19,20,21వ తేదీల్లో యాదగిరిగుట్ట పట్టణంలో సంఘం రాష్ట్ర మహాసభలు ఉన్నాయని, వేలాదిమంది గీత కార్మికులతో బహిరంగసభ నిర్వహించి లక్ష్మీనర్సింహాస్వామి సన్నిధిలో సింహాగర్జన చేస్తామని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ.రమణ అన్నారు.ఆదివారం మండలకేంద్రంలోని సాయిగణేష్ ఫంక్షన్హాల్లో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా 3 వ మహాసభ మద్దెల రాజన్న అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీతబంధు ద్వారా గీతన్నలకు రూ.10 లక్షలివ్వాలని డిమాండ్ చేశారు. గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్రబడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించాలని కోరారు.చెట్ల పెంపకానికి భూమి ఇవ్వాలి, కల్లుకు మార్కెట్ కల్పించాలి కోరారు.నీరా, తాటి ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఎక్స్గ్రేషియాను రూ.10లక్షలకు పెంచాలని కోరారు.పెన్షన్ రూ.5 వేలకు పెంచాలని కోరారు.ఈ సందర్భంగా పట్టణంలో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించారు.మహాసభల సందర్భంగా సంఘం జెండాను సంఘం సీనియర్ నాయకులు పబ్బతి మల్లేశం ఆవిష్కరించారు.అనంతరం జిల్లాకమిటీని ఎన్నుకున్నారు.జిల్లా అధ్యక్షునిగా రాగిర్ కృష్ణయ్య, ప్రధానకార్యదర్శిగా బోలగాని జయరాములు, జిల్లా ఉపాధ్యక్షులు గా మద్దెల రాజయ్య, బత్తుల లక్ష్మయ్య,నెమిలె మహేందర్,కొరుకొప్పుల కిష్టయ్య, ఎరుకల భిక్షపతి, పబ్బతి మల్లేష్,మొరిగాడి రమేశ్, కొక్కొండ లింగయ్య,భావండ్లపల్లి బాలరాజు, గుండ్లపల్లి వెంకటేశ్, సహాయకార్యదర్శులుగా దూపటి వెంకటేష్, గాజుల ఆంజనేయులు,బత్తిని భిక్షం, పులిభిక్షంతో 45 మందిని జిల్లా కమిటీ సభ్యులు గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈకార్యక్రమంలో రేఖల లక్ష్మీనారాయణ, పల్సం స్వామి, లింగం సాయిలు,అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు సొసైటీ అధ్యక్షులు పాల్గొన్నారు.