Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యాపేటటౌన్:సూర్యాపేట కీర్తి కిరీటంలో రెండు వజ్రాలు మీలా సత్యనారాయణ, అనంతుల జనార్దన్లని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ ఆదుర్తి రమేష్‌చంద్ర అన్నారు.వారిరువురు భానుపురి బతుకమ్మకు ఇష్టమైన రెండు పూలని కొనియాడారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ఆస్పత్రి వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీల్స్ఆన్ వీల్స్ అల్పాహారం అందించే కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, సుధాకర్ పీవీసీ కంపెనీ ఎండి,సుధాబ్యాంక్ చైర్మెన్ మీలా మహదేవ్,మీలా జయదేవ్,అనంతులకృపాకర్ల ఆధ్వర్యంలో రోగులకు,సహాయకులకు అల్పాహారం పంపిణీ చేశారు.ఈ సంధర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ ఆదుర్తి రమేష్ చంద్ర మాట్లాడుతూ సూర్యాపేటకు లయన్స్ క్లబ్ ను 49 సంవత్సరాల క్రితం మీలా సత్యనారాయణ, అనంతుల జనార్దన్‌లు తీసుకొచ్చారని గుర్తు చేశారు.ప్రభుత్వఆస్పత్రికి వచ్చే రోగులకు,వారి సహాయకులకు రెండు నెలల నుండి 18,000 మందికి అల్పాహారం అందజేశామన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త మీలా మహదేవ్,మీలా నిర్మల జయదేవ్ దంపతులు, అనంతులకృపాకర్, కక్కిరేణిచంద్రశేఖర్,తోట శ్యామ్‌ప్రసాద్,లయన్స్ క్లబ్ ఆర్సీ చిలుముల శ్రీనివాస్‌రెడ్డి, జెడ్సీ మర్రు హనుమంతరావు, కోశాధికారి రాచకొండ శ్రీనివాస్, రఫీ, లక్ష్మీ కాంత్‌రెడ్డి, శ్రీదేవి, వేణుగోపాల్ పాల్గొన్నారు.