Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లిబిడ్డా క్షేమం
నవతెలంగాణ-నూతనకల్
ప్రభుత్వ హాస్పటల్ లోనే సాధారణ కాన్పు లకు సాధ్యమవుతుందని మండల ప్రాథమిక వైద్యాధికారి నాగరాజు అన్నారు.ఆదివారం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆయన మాట్లాడుతూ శనివారం రాత్రి మద్దిరాల మండలం మామిండ్లమడవ గ్రామానికి చెందిన షేక్ మైరూన కాన్పు కోసం శనివారం రాత్రి హాస్పటల్లో చేరారన్నారు.ఉదయం సాధారణ ఆమెకు సాధారణ ప్రసవం జరిగిందని ప్రస్తుతం తల్లీ,3 కేజీలమగబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారన్నారు.ఇటీవల కాలం నుండి 10 సాధారణ కాన్పుల్లో ఎనిమిది మందికి తల్లులకు ఈఆస్పత్రిలో మగబిడ్డలే జన్మించడంతో ఆస్పత్రి మగబిడ్డలకు సెంటిమెంట్‌గా భావిస్తున్నారన్నారు.ప్రసవమైన ప్రతి తల్లికి ఆస్పత్రి సీహెచ్ఓ సల్వాది శ్రీనివాస్జ్యోతిలు తమ సొంత ఆర్థికఖర్చులతో రాగిబిందెను బహుమతిగా అర్పిస్తూ ఇస్తూ ఆస్పత్రిలో కాన్పుల ప్రోత్సహించడాన్ని అభినందించారు.అనంతరం కేసీఆర్ కిట్‌ను వారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ సల్వాది శ్రీనివాస్,స్టాఫ్‌నర్స్ సునీత, సూపర్వైజర్ మాణిక్య, ఏఎన్ఎం చావజ్యోతి, వజ్రమ్మ, సరస్వతి, వనిత, రజని, శాంత, ఆనందగౌడ్, ఆయా వెంకటమ్మ, ఆశా రజియా పాల్గొన్నారు.