Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
మున్సిపల్ కార్మికుల మూడు నెలల జీతాలు వెంటనే ప్రకటించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 26 వేల రూపాయలు చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక మార్కెట్ యార్డులో మున్సిపల్ కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వేతనాలు 11 నెలల నుండి పెండింగ్లో పెట్టాయని, వాటిని కార్మికులకు వెంటనే చెల్లించాలని కోరారు. ప్రతి నెలలో 26 రోజులు డ్యూటీలు, అమలు చేసి, ప్రతి ఆదివారం సెలవు ప్రకటించాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సైట్లో ఆదేశాల మేరకు మున్సిపాలిటీలో అమలు చేయడం లేదన్నారు. విధినిర్వహణలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇన్సూరెన్స్ పీఎఫ్ ,ఈఎస్ఐ వంటి రెగ్యులర్గా గుర్తింపు కార్డు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఆ సంఘం మండల కార్యదర్శి మోగుదాల వెంకటేశం, సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, మున్సిపల్ కార్మికులు కత్తుల సైదులు, అనపర్తి చిన్న వెంకన్న, లింగ స్వామి, కలమ్మ, వెంకన్న ,చంద్రమ్మ, నాగరాజు, రవణమ్మ, జంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక...
మున్సిపల్ కార్మికుల అధ్యక్షునిగా అనపర్తి వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా కత్తుల సైదులు, ఉపాధ్యక్షులుగా లింగస్వామి కలమ్మ, సహాయ కార్యదర్శులు వెంకన్న, చంద్రమ్మ, కోశాధికారిగా నాగరాజు, ప్రచార కార్యదర్శిగా రవణమ్మ, సంస్కృతిక కార్యదర్శి జంగమ్మలు నూతన కమిటీగా ఎన్నికయ్యారు.