Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా చేస్తున్న వైఖరిని తిప్పికొట్టేందుకు జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రశ్నించే గొంతుగా టీయూడబ్ల్యూజేఎఫ్ పనిచేస్తుందని టిడబ్ల్యూజే జాతీయ కౌన్సెలింగ్ సభ్యులు గాదే రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాదిని నర్సింహాగౌడ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎన్ఎస్ఎస్ఆర్ పాఠశాలలో నిర్వహించిన మునుగోడు నియోజకవర్గ మహాసభకు వారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవ్ఱేట్ పాఠశాలల్లో ఫీజు రాయితీ చెల్లించమని టిడబ్ల్యుజేఎఫ్ పోరాట ఫలితంగానే మూడు రోజుల క్రితం రాయితీ వర్తింపజేయాలని విద్య అధికారులకు జీవో జారీ చేశారని గుర్తు చేశారు. ప్రతి జర్నలిస్టుకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం పోరా టాలు నిర్వహించడానికి ప్రతి ఒక్క జర్నలిస్టు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.అనంతరం టిడబ్ల్యూజేఎఫ్ మునుగోడు నియోజకవర్గ నూతనం కమిటీని ఎన్ను కున్నారు.మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించిన టిడబ్ల్యూజేఎఫ్ మునుగోడు నియోజకవర్గ మహాసభలో మునుగోడు నియోజకవర్గ అధ్యక్షునిగా, జాజుల స్వామిగౌడ్ (దిశ),ప్రధానకార్యదర్శిగా నారాయణపురం మండలానికి చెందిన చిలువేరు అంజయ్య (నవతెలంగాణ)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారితో పాటు కోశాధికారిగా చిలువేరు సంజీవ, ఉపాధ్యక్షులుగా కొర్రె మురళి, బాలరాజు, బోయపల్లి రమేష్, సహాయ కార్యదర్శిగా జీడిమడ్ల నరేష్, కాటేపాక శంకర్, గాదె వినోద్కుమార్తదితరులను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన స్వామిగౌడ్, అంజయ్య మాట్లాడుతూ టిడబ్ల్యూజేఎప్ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానన్నారు.