Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
మండలకేంద్రంతో పాటు, మండలపరిధిలోని వివిధ గ్రామాలలో ఒక్కేసి పువ్వేసి సందమామా.. ఒక్క జాము ఆయే సందమామా..... సిత్తూ సిత్తూల బొమ్మ, శివుని ముద్దుల గుమ్మ.... అంటూ ఆటపాటలతో తీరొక్క పూలతో ఊరువాడ లోగిళ్ళన్నీ పుష్పవనాలుగా ఆవిష్కతమయ్యాయి.ప్రతి ఊరిలో మైదానాల వద్ద, చెరువులు, కుంటల వద్ద బతుకమ్మ ఘాట్లను నెలకొల్పి నిమజ్జనం ఏర్పాట్లను చేశారు.ప్రజలకు ఎంపీపీ గుండగాని కవితా రాములుగౌడ్, సీపీఐ(ఎం) మండలకార్యదర్శి బుర్ర శ్రీనివాస్,రైతుసంఘం జిల్లా నాయకులు పల్లా సుదర్శన్, వైస్‌ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలంయాదవ్,డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, కాంగ్రెస్ మండలఅధ్యక్షులు దొంగరి గోవర్ధన్,బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి మల్లెపాక సాయిబాబా,మండలఅధ్యక్షులు గాజుల మహేందర్, టీఆర్ఎస్ మండలఅధ్యక్షులు తాటికొండ సీతయ్య శుభాకాంక్షలు తెలిపారు.
నూతనకల్:మండలకేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు.రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి సాంప్రదాయ పాటలతో డీజే డ్యాన్సులతో ఆడిపాడిన అనంతరం బతుకమ్మలను చెరువులలో నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ ó పార్టీల నాయకులు పాల్గొన్నారు.
నాగారం : మండలపరిధిలోని ఆయా గ్రామాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.అనంతరం బతుకమ్మను చెరువుల్లో నిమజ్జనం చేశారు.
పెన్‌పహాడ్ :మండలవ్యాప్తంగా బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇంటింటా మహిళలు, యువతులు, చిన్నపిల్లలు రంగు రంగులపూలతో బతుకమ్మలు పేర్చుకుని ప్రత్యేక పూజలు చేసి ప్రధాన కూడళ్లలో ఆటపాటలాడారు.ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయే చందమామ అని బతుకమ్మ విశిష్టతను తెలుపుతూ ఆడపడుచులు పాటలు పాడారు.అనంతరం సమీపంలోని చెరువులు, కుంటలలో బతుకమ్మను నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో చిన్నగారకుంట సర్పంచ్ శాలిభారు తదితరులు పాల్గొన్నారు.