Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్రిగూడ
టీిఆర్‌ఎస్ పార్టీ 26 వ తేదీ నుండి దళితవాడలో వన భోజనం కార్యక్రమం నిర్వహిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసనసభ్యులు బాల్క సుమన్ అన్నారు. ఉంటుందని అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు సమన్యాయం జరిగేలా సమానమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందని, కుల వత్తుల సంక్షేమమే ప్రధాననెజెండాగా ముందుకెళ్తున్నారని తెలిపారు. హనుమాన్ టెంపుల్ లేని ఊరు టిఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు రానీ ఊరు ఉండదన్నారు. బీజేపీ మతోన్మాద పార్టీ అని, బిజెపి పాలిత ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గాల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. 26 వ తేదీ నుండి దళితవాడలో జరిగే వనభోజన కార్యక్రమాలు టిఆర్ఎస్ కుటుంబ సభ్యులంతా ఐక్యమత్యంతో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారిలో అవగాహన కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో మర్రిగూడ మండల ఇంచార్జ్, నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, జెడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అయితగోని వెంకటయ్య,దళిత బంధు జిల్లా డైరెక్టర్ లపంగి నరసింహ, మండల దళిత సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.