Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొండమల్లేపల్లి
పట్టణంలోని స్థానిక చౌరస్తా సెంటర్ నుంచి నల్లగొండ రోడ్డులోని గౌరీ కుంట తండా స్టేజి వరకు నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఫోర్ వే సీసీ రోడ్ పనులకు ఆదివారం దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్ అండ్ బి నిధుల నుండి మూడు కోట్ల 55 లక్షల రూపాయలతో కిలోమీటర్ మేరా వరకు పనులను చేపడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసినటువంటి లైట్లు ఎమ్మెల్యే సొంత నిధులతో లైట్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ సిరందాస్ లక్ష్మమ్మ కృష్ణయ్య, జెడ్పీటీసీ పసునూరి సరస్వతి, వైస్‌ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌గౌడ్, రైతుబంధు మండలాధ్యక్షుడు లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.