Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
నవంబర్ 12,13వ తేదీల్లో తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం యాదాద్రి జిల్లా రెండో మహాసభలను మోత్కూరులో నిర్వహిస్తున్నామని, సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి కొండమడుగు నర్సింహ కోరారు.జిల్లా మహాసభల విజయవంతం కోసం ఈనెల 27న మోత్కూరులో నిర్వహించే సన్నాహక సమావేశం విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు.ఎన్నో పోరాటాలకు నిలయమైన మోత్కూరు జిల్లా మహాసభలకు వేదిక కాబోతుందన్నారు.27న స్థానిక ఆర్యవైశ్యభవన్లో జరిగే సన్నాహకసమావేశంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, రాచకొండ రాములమ్మ, పట్టణ కార్యదర్శి మెతుకు అంజయ్య, నాయకులు కందుకూరినర్సింహ, చామకూర వెంకన్న, గుండులక్ష్మీకళమ్మ, శోభ, ఎం.పద్మ, పి.శోభ, జి.కల్యాణి, జి.సరిత, మాధవి, ఉమ, జోనమ్మ, లక్ష్మీ పాల్గొన్నారు.