Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డుపై బైఠాయించిన కాలనీవాసులు
- మద్దతు తెలిపిన వార్డు కౌన్సిలర్ స్వామి
నవతెలంగాణ-భువనగిరిరూరల్
జిల్లాకేంద్రంలోని రాంనగర్ దళితవాడలో మహిళలు ఆడడానికి స్ట్రీట్ లైటు వేయలేదని మహిళలు కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మున్సిపల్ బతుకమ్మ మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్తుండగా ఆదివారం రాత్రి రోడ్డుపై బైఠాయించి ముందు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా 8వ వార్డు కౌన్సిలర్ పంగరెక్కల స్వామి మాట్లాడుతూ రాంనగర్లో దళితవాడలో దళితుల పట్ల వివక్ష చూపుతూ దేవాలయం వద్ద స్ట్రీట్లైటు వేయడం లేదని వారికి ుద్దతుగా రోడ్డుపై బైఠాయించారు.మున్సిపల్ కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ దళితకాలనీలో స్ట్రీట్ లైట్ వేయడం లేదని సంబంధిత కాంట్రాక్టర్కు ఫోన్ చేసినా స్పందించడం లేదని వాపోయారు.ఈ కార్యక్రమంలో రాచమల్ల సుదర్శన్, బందేలఎల్లయ్య, రమేష్, గడ్డంయాదగిరి, శ్రీను, మహిళలు మంజుల, భారతమ్మ, యాదమ్మ, కాలనీవాసులు పాల్గొన్నారు.