Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకంలో ఎమ్మెల్యేల ప్రమేయాన్ని నివారించాలని టీఎస్ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.మండలకేంద్రంలో ఆదివారం ఆ సంఘం కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం ఎమ్మెల్యేల చుట్టూ తిరిగేవాళ్లకే దక్కుతుందని ఆరోపించారు.నిజమైన లబ్దిదారులకు దక్కడం లేదని పేర్కొన్నారు.పథకం అమలు ఎమ్మెల్యేల చేతిలో ఉండడంతో రూ.2లక్షల నుండి రూ.4 లక్షల వరకు మధ్య దళారులు వసూలు చేస్తున్నట్టు వార్తా కథనాలు, మీడియాలో ,ప్రసార మాధ్యమాలలో రావడం ఇటీవల కాలంలో చూస్తున్నామన్నారు. దళితబంధు పథకానికి తాము వ్యతిరేకం కాదని తెలిపారు.నిజమైన లబ్దిదారులను గుర్తించి అమలు చేసే కార్యాచరణ మాత్రం కలెక్టర్, అధికారులకు అప్పగించాలని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ నెల 26 తేదీ నుండి 30 వ తేదీ వరకు రాష్ట్ర మంత్రులకు వినతిపత్రం అందజేయాలని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అక్టోబర్ లో 11, 12వ తేదీలలో తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల ఎదుట ధర్నా చేయాలని కార్యకర్తలకు సూచించారు. 17, 18వ తేదీలలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయాటకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోరారు. 28 తేదీన దళితబంధు పథకం అమలులో పూర్తిగా ఎమ్మెల్యేల ప్రమేయాన్ని తొలగించాలని లక్ష మందితో ఇందిరాపార్కు దగ్గర మహాధర్నా నిర్వహిస్తామన్నారు.అనంతరం ధర్నాలకు సంబంధించిన కరపత్రం మండల అధ్యక్షుడు గ్యాదపాక మల్లేష్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు చిలకమారి గణేష్, జిల్లా అధ్యక్షుడు కూరేళ్ళ రమేశ్,జిల్లా అధికార ప్రతినిధి భూషిమహేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బైరపాక నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు సంగిస్వామి, నియోజకవర్గ ఇన్చార్జి క్యాసగళ్ళ రమేష్, గంగపురంరాములు, యాదగిరి, కష్ణ, ఉప్పలయ్య, నరేష్, స్వామి, శ్రీకాంత్, వెంకటేష్, సురేష్, నరేష్, మహేష్, మురళి, రవి, పరుశరాములు, గోవర్ధన్, వెంకట్ పాల్గొన్నారు.