Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-ఆత్మకూరుఎస్
నీరా, తాటి ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మికసంఘంజిల్లా ప్రధానకార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్చేశారు. ఆదివారం మండలకేంద్రంలో నిర్వహిం చిన ఆ సంఘం మండలమహాసభలో ఆయన మాట్లాడారు.నీరా, తాటిఉత్పత్తుల పరిశ్రమలను ఏర్పాటు చేసి గీత కార్మికులకు యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్ నగరంలో సర్దార్ సర్వాయి పాపన్నవిగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరారు. కల్లుగీత ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ.5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు.అన్ని గ్రామాలలో ప్రతి సొసైటీకి ఐదెకరాల భూమి ఇచ్చి, తాటి, ఈత,ఖర్జూర,జినుగు మొక్కలను పెంచాలని కోరారు.కల్లులో ఉన్న పోషకాలను ప్రభుత్వమే ప్రచారం చేసి మార్కెట్ సౌకర్యం కల్పించాలని కోరారు.తాటిచెట్టు పై నుండి పడి ప్రమాదం వల్ల చనిపోయిన కుటుంబాలకు,శాశ్వత వికలాంగులకు రూ.10 లక్షలివ్వాలని కోరారు.మెడికల్ బోర్డు నిబంధన తొలగించి గతంలో లాగే ప్రభుత్వ డాక్టర్ ధ్రువీకరణ చేస్తే ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు.అంతకుముందు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గౌడ కల్లుగీత కార్మికులకు ఘనంగా నివాళులర్పించారు.అనంతరం సంఘం జిల్లా అధ్యక్షులు ఎలుగూరి గోవింద్ మాట్లాడుతూ ఈనెల 29 దండు మైసమ్మ దగ్గర శుభం ఫంక్షన్హాల లో జరుగు జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ మహాసభలో మాజీ ఎంపీపీ కసగానిలక్ష్మీ బ్రహ్మం,జిల్లా ఉపాధ్యక్షులు ఉయ్యాల నగేష్, మడ్డిఅంజిబాబు, నాయకులు జెర్రిపోతుల కృష్ణ,తండ రమేశ్, కట్ట గోవర్ధన్ మాజీ సర్పంచ్ గిలకత్తులసోమయ్య, మూలఎల్లయ్య,సిగశ్రీను,గుణగంటి శ్రీను, కాట్ల వెంకన్న, మద్దెలసైదులు,పిట్టలపెదవీరయ్య,మండాది రామస్వామి,బిక్కి బక్కయ్య, గుణగంటి లింగయ్య, పసునూరి తిరుమలయ్య,చౌగోని మల్లయ్య పాల్గొన్నారు.