Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబసభ్యులు,బంధువులే లబ్దిదారులు
- అనర్హులను తొలగించాలని కలెక్టర్కు ఫిర్యాదు
నవతెలంగాణ-మఠంపల్లి
వెనకబడిన తరగతులవారికి అందించే కార్పొరేషన్ రుణాలలో నిజమైన లబ్దిదారులను కాకుండా కుటుంబసభ్యులను, బంధువులను ఎంపికచేసి ప్రజాప్రతినిధుల'మార్కు' లిస్టు తయారుచేసి సంబంధిత అధికారికి పంపటం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈవిషయంలో ఎంపికసక్రమంగా జరగలేదని కలెక్టరుకు ఫిర్యాదుచేశారు.వివరాల్లోకి వెళితే మఠంపల్లి మండలంలోని గిరిజనులకు 2020-21బీ2021-22 కుగాను ఎస్టీ కార్పొరేషన్ రుణాలు మంజూరయ్యాయి.లబ్దిదారుల ఎంపిక చేయాల్సి ఉండగా అనేక మంది దరఖాస్తు చేసుకున్నా అన్ని అర్హతలు ఉన్నా అవేమీ పట్టించుకోకుండా అధికారపార్టీ ప్రజాప్రతినిధులు 6 తండాలకు సంబంధించి 36 మందిని ఎంపిక చేశారు.వారికి 82 లక్షల రుణాలిచేందుకు సంబంధిత మాడాప్రాజెక్ట్ అధికారికి లిస్టు పంపించినట్టు తెలిసింది.అందులో ఎంపీపీ గ్రామం గుర్రంబోడుతండా, అవిరేణిగుంటతండా, జాములతండా, కాల్వపల్లితండా,భీమ్లా తండా, కష్ణతండాలలోని వారిని ఎంపిక చేశారు.ఎంపికచేసిన లబ్దిదారులను పరిశీలించి అనర్హులను తొలగించి, అర్హులైనవారికి ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
అనర్హులను తొలగించాలి
భూక్యానాగచైతన్య-పాతదోనబండతండా
ఎంపిక చేసిన లబ్దిదారులలిస్టు పరిశీలిస్తే అందరూ ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులు,బంధువులు ఉన్నారని, ఈవిషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం.తనలాంటి అర్హులకు చాలామందికి రాలేదు.ఇప్పటికైనా అధికారులు విచారించి అనర్హులను తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
బ్యాంక్ కాన్సంట్ ఇచ్చినవారి పేర్లే పంపాము
ఎంపీడీఓ జానకిరాములు
బ్యాంకు అధికారులు కాన్సంట్ ఇచ్చినవారి పేర్లు పంపాము. మిగతా వాళ్ళ పేర్లు పంపలేదు.