Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరు రూరల్
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దుపటి వెంకటేష్ అన్నారు. సోమవారం మండలంలోని పటేల్ గూడెం గ్రామంలో నిర్వహించిన ఈ పార్టీ శాఖ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల హామీలు భాగంగా రైతు రుణమాఫీ చేస్తామని మూడేళ్లు అయినా ఇంతవరకు రుణమాఫీ చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు ఆందోళనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు ..ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు నల్ల మాస తులసయ్య, పిక్క గణేష్, పులగం యాదిరెడ్డి ,పార్టీ శాఖ కార్యదర్శి నిలిగొండ వాలి, సీనియర్ నాయకులు భీమ గాని నరసయ్య, బొమ్మ కంటి లక్ష్మీనారాయణ, కొండం సుధాకర్ రెడ్డి, గ్యార భాస్కర్ ,శ్రీను ,బయన్న ,బాలరాజు, జాంగిర్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.