Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
నవతెలంగాణ -వలిగొండ
రాష్ట్రంలో మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే బతుకమ్మ చీరలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో స్థానిక శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాఠశాలలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అంతకుముందు మండల పరిషత్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో పాల్గొని పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ ,జెడ్పీటీసీ వాకిటి పద్మా నంద రెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ కొనపురి కవిత సింగిల్విండో చైర్మెన్ సురకంటి వెంకట్రెడ్డి, తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, ఎంపీటీసీిలు పాలుచం రమేష్, తుమ్మల వెంకటరెడ్డి, కుందారపు యశోద, పల్లెల భాగ్యమ్మ, సర్పంచ్ లలిత ,ఉప సర్పంచ్ మత్స్యగిరి, ఏపీఓ జానీ పాల్గొన్నారు.