Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్
నవతెలంగాణ-చౌటుప్పల్
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. సోమవారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని ట్రినిటి విద్యాసంస్థల ఆధ్వర్యంలో వివిధ రకాల రంగుల పూలతో ఉపాధ్యాయురాళ్లు, విద్యార్థినులు 18 అడుగుల బతుకమ్మను పేర్చి స్థానిక మార్కెట్‌యార్డులో అంగరంగ వైభవంగా ఆడిపాడారు. విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు అందరిని అలరించాయి. ఈ సందర్భంగా లింగయ్యయాదవ్ విద్యార్థినులతో కలిసి కోలాటం ఆడారు. 18 అడుగుల ఎత్తులో బతుకమ్మ పేర్చిన ట్రినిటి విద్యాసంస్థల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ వెన్‌రెడ్డి రాజు, ట్రస్మా తెలంగాణ రాష్ట్ర ప్రయివేట్ అధీకృత విద్యాసంస్థల అధ్యక్షులు కందాల పాపిరెడ్డి, కోశాధికారి రఘుసురేశ్కుమార్, ట్రినిటి విద్యాసంస్థల డైరెక్టర్, ప్రిన్సిపాల్ మంజుల, చైర్మెన్ కేవీబీ.కృష్ణారావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.