Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
దేశంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని సీపీఐ(ఎం) మున్సిపాలిటీ, మండలకార్యదర్శులు బండారు నర్సింహా, గంగదేవి సైదులు విమర్శించారు. ఉత్తరఖండ్ రాష్ట్రంలోని కేదరనాథ్లో హౌటల్లో రిసెప్షనిస్టుపై బీజేపీ మాజీ మంత్రి కుమారుడు లైంగికదాడిని నిరసిస్తూ సోమవారం పట్టణకేంద్రంలోని జాతీయ రహదారిపై ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరఖండ్‌లో జరిగిన సంఘటనకు సంబంధించిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పల్లె మధుకృష్ణ, నాయకులు ఆకుల ధర్మయ్య, సప్పిడి శ్రీనివాస్‌రెడ్డి, బత్తుల దాసు, భావండ్లపల్లి స్వామి, అమర్, సాలయ్య, శ్రీనివాస్‌రెడ్డి, బొమ్మకంటి కృష్ణ, నరేశ్, మధు, శివ పాల్గొన్నారు.