Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూ నిర్వాసితులను కాపాడాలి
- రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్
నవతెలంగాణ- భువనగిరిరూరల్
త్రిబుల్ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో చౌటుప్పల్ మండల రైతులు సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. చౌటుప్పల్ మండలంలోని మందోల్లగూడెం, తూర్పు గూడెం, సింగరాయ చెర్వు, కుంట్లగూడెం, నేల పట్ల, లింగారెడ్డిగూడెం, తాళ్ల సింగారం, చౌటుప్పల్ టౌన్, తంగడపల్లి, వలిగొండ మండలం వర్కట్ పల్లి గ్రామాల రైతులు వాహనాల్లో తరలివచ్చి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి, రోడ్డుపై బైటాయించి రెండు గంటల పాటు రోడ్ల దిబ్బందం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలో 300 కుటుంబాలకు చెందిన చిన్న సన్నకారు రైతులకు ఎకరా ఉన్నటువంటి దానిపైనే జీవనాధారంగా బతుకులు వెళ్లదీస్తున్నారన్నారు. పేద రైతాంగాన్ని నట్టేట ముంచే విధంగా త్రిబుల్ ఆర్ రోడ్లు వేయటాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతుల భూముల్లో మార్కింగ్ చేశారని కేంద్ర ప్రభుత్వం తక్షణమే అలైన్మెంట్ మార్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు .వలిగొండ మండలం వర్కట్‌పల్లి ,గోకారం తో పాటు పట్టణంలోని వలిగొండ రోడ్డులో పద్మశాలి కాలనీకి సంబంధించిన 500 కుటుంబాలకు సంబంధించిన ఇండ్లను కోల్పోతున్నటువంటి బాధితులు కూడా పెద్ద ఎత్తున కలెక్టరేట్‌ని ముట్టడించారు ధర్నాస్థలికి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి వచ్చి ప్రభుత్వానికి విజ్ఞప్తిని పంపిస్తామని హామీ ఇచ్చి విరమింపజేేశారు అనంతరంకలెక్టర్ పమేలా సత్పతి బాధిత రైతులు వినతిపత్రం అందజేసి తమ బాధలను విన్నవించుకున్నారు. ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు స్థానిక ఎంపీటీసీ చిన్నవాని వెంకటేశం, వెలగ శ్రీధర్ రెడ్డి,,గంగాదేవి, సైదులు, బొమ్మిరెడ్డి ప్రతాప్ రెడ్డి , బుర్ల రాములమ్మ, కొండ ఎల్లమ్మ, కంచర్ల రూపమ్మలు పాల్గొన్నారు.