Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తెలిపారు.సోమవారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డే కార్యక్రమానికి హాజరుకాని ఖజాన శాఖ, విద్యుత్ శాఖ, పశు సంవర్ధక శాఖ, అధికారులకు మెమో జారీ చేశామన్నారు.గ్రీవెన్స్‌కు వచ్చే ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని,వారి సమస్య ఎన్ని రోజులలో పరిష్కరించబడుతుందో తప్పక తెలపాలని ఆదేశించారు.ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. ప్రజావాణి అనంతరం శాఖల వారీగా పరిష్కరించబడిన దరఖాస్తుల వివరాలు తెలపాలన్నారు. సమావేశ మందిరంలో శాఖల వారీగా ఏర్పాటు చేసిన చోటనే ఆ శాఖకు చెందిన అధికారులు కూర్చోవాలన్నారు. ఫిర్యాదుదారుని పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు.ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 50 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏవో శ్రీదేవి, సూపరింటెండెంట్ సుదర్శన్, అన్ని శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.