Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
రాష్ట్రంలో షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్లో కార్మికులకు కనీసవేతనాలను సవరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టియాదగిరిరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి మేకల శ్రీనివాసరావు, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం కలెక్టరేట్ ముందు వివిధ కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీసవేతనాలను ప్రతిఐదేండ్ల కోస ారి సవ రించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటివరకు సవరణ జరగలేద న్నారు.పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెలు, విద్య, వైద్యం, ఖర్చులు పెరిగి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఈనేపధ్యంలో 73 షెడ్యూల్డ్ ఎంప్లాయీమెంట్లో వేతనాలు సవరించి జీఓ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.సలహా మండలి తీర్మానం మేరకు రూ.18000 నిర్ణయించి అమలు చేయాలని,కార్మికుల కడుపులు కొట్టి యజమానుల బొజ్జలు నింపే విధానం మానుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, మామిడి సుందరయ్య, సాయికుమార్, ఏఐటీయూసీ నాయకులు లతీఫ్, జీవీ.రాజు, రాఘవరెడ్డి, రాంబాబు,బూర వెంకటేశ్వర్లు, ప్రభాకర్,ఐఎఫ్టీయూ నాయకులు సైదులు పాల్గొన్నారు.