Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాత్రికి రాత్రి మోటార్ల కేబుల్ ఎత్తుకెళ్తున్న ముఠా
- శనివారం రాత్రి 20 మోటార్ల వైర్లుమాయం
- లబోదిబోమంటున్న రైతులు
నవతెలంగాణ-పెన్‌పహాడ్
మండలంలో నయా మాఫియా పెట్రేగి పోతుంది.రాగివైరు లక్ష్యంగా సాగర్ ఎడమ కాలువపై అన్నదాతలు ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ మోటార్లకు చెందిన కేబుల్ వైర్లను ఎత్తుకెళ్లడమే ఈ నయా ముఠా టార్గెట్.తాజాగా శనివారం రాత్రి 20 మంది రైతులకు చెందిన మోటార్ వైర్లను ఎత్తుకెళ్ళడంతో అన్నదాతలు లబో ధిబోమంటున్నారు.నాగార్జున సాగర్ ఆయకట్టు ఎడమ కాలువ మండలంలో విస్తరించి ఉండగా అనేక మంది రైతులు వ్యవసాయ మోటార్లను వినియోగించి సాగు చేసుకుంటున్నారు.ఇదే అదునుగా ఆరు నెలలుగా సరికొత్త ముఠా రెచ్చిపోతుంది.రాగి వైర్ ధర బహిరంగ మార్కెట్లో రూ.2 వేలు పైమాటే... సాగర్ ఎడమ కాలువపై రైతులు వ్యవసాయ మోటార్లు - స్టార్టర్లకు అనుసంధానంగా కాపర్ కేబుల్‌ను ఉపయోగిస్తుంటారు. వీటిపై కన్నేసిన ముఠా నిత్యం ఏదో ఒక ప్రాంతాన్ని టార్గెట్‌గా చేసుకుని వైర్లను కట్ చేసి ఎత్తుకెళ్లి, వైర్ లలో రాగిని తీసి సొమ్ము చేసుకుంటుంది.శనివారం రాత్రి మండల పరిధిలోని దోసపహడ్, దుబ్బగుడెంల వద్ద 20 మంది రైతులకు చెందిన మోటార్ వైర్లను ఎత్తుకెళ్లారు.దీంతో ఉదయం వైరు చోరీలను గుర్తించిన రైతులు లబోదిబోమంటున్నారు. ఇలా ఈ ఏడాది ఇప్పటికే మూడుసార్లు ఎత్తుకెళ్ళడంతో ఇప్పటికే రైతులు ఇప్పటికే ఈ ఖరీఫ్ సీజన్లో ఒక్కో రైతు రూ.5 వేల వరకు నష్టపోయారు. కాగా గతంలో గ్రామాల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్ఐ బత్తిని శ్రీకాంత్‌గౌడ్ మండలంలోని ప్రజాప్రతినిధులకు, ప్రతినిదులను, సర్పంచులకు విజ్ఞప్తి చేశారు.అయినా అది కార్యరూపం దాల్చలేదు. ఇకనైనా పోలీసులు పహారా కాసి ముఠా అగాడాలపై కన్నేసి వారి ఆట కట్టించాలని రైతులు కోరుతున్నారు.