Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు నెమ్మాది వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-సూర్యాపేట
సమాజంలో ఇంకా అంతర్లీనంగా కొనసాగుతున్న కులవివక్షను అంతం చేయాలంటే కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎంవీఎన్ భవనంలో నేరేడుచర్ల మండలం వైకుంటపురం గ్రామ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బొల్లెద్దు శేఖర్, నేరేడుచర్ల మండలం జానలదిన్నె గ్రామానికి చెందిన ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన షేక్ రెహనాల కులాంతర ఆదర్శ వివాహంలో ఆయన మాట్లాడారు.కుల అంతరాలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకోవడం అభినందనీయమని జంటను అభినందించారు. నేటి కంప్యూటర్యుగంలో కూడా ఇంకా కులఅసమానతలు కొనసాగడం దురదష్టకరమన్నారు.కుల నిర్మూలన జరగాలంటే కులాంతర వివాహాలని ప్రోత్సహించాలని అంబేద్కర్ చెప్పిన విధానాలను అమలు చేయాలన్నారు.సమాజంలో కులాంతర మతాంతర వివాహాలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం కులాంతర వివాహం చేసుకున్న జంటలకు రక్షణ కల్పించే విధంగా చట్టం చేయాలని డిమాండ్ చేశారు.కులాంతర వివాహితులకిచ్చి ప్రోత్సాహకాన్ని సకాలంలో అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోటగోపి, కల్లుగీత కార్మికసంఘం జిల్లా అధ్యక్షులు ఎలుగూరి గోవిందు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న, సీఐటీయూ పట్టణ కన్వీనర్ మామిడి సుందరయ్య, ప్రజాసంఘాల నాయకులు నందిపాటి సతీష్, సైదులు, నాగరాజు, మహేష్, ఉదరు తదితరులు పాల్గొన్నారు.