Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
మహిళా చైతన్యానికి ప్రతీక తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ అని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.సోమవారం సూర్యపేట కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో చాకలి ఐలమ్మ 127 వ జయంతి వేడుకల సందర్భంగా ఆమె చిత్రపటానికి కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్‌తో కలిసి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ఆమె చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాటల్ని తూటాలుగా మలిచి. దోపిడిదారుల గుండెల్లో ఫిరంగిగా పేలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ అన్నారు.మె జీవితం భవిష్యత్ తరాలకు స్పూర్తిదాయకమైందన్నారు. తెలంగాణ తెగువకు నిదర్శనమని, మహిళా చైతన్యానికి ప్రతీక అన్నారు.అత్యంత వెనకబడిన కులంలో( ఎంబీసీ) జన్మించిన ఆమె తెలంగాణ బహుజనవర్గాల స్ఫూర్తిప్రదాత అన్నారు. చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు, చాకలి ఐలమ్మ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి త్వరలోనే అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వెనకబడిన కులంలో అభివృద్ధి అధికారిణి అనసూర్య, కలెక్టరేట్ సిబ్బంది అన్ని శాఖల అధికారులు, రజకసంఘం జిల్లా అధ్యక్షులు చెరుకు వెంకన్న, నెల్లుట్ల వీరయ్య, జయమ్మ, నాంచారి, ప్రతాప్ పాల్గొన్నారు.