Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓరుగల్లు పోరుబిడ్డ
- శాసనమండలి చైర్మెన్ గుత్తా, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
నవతెలంగాణ-నల్లగొండ
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం భూస్వాములపై రజాకార్లపై ఉక్కు పిడికిలి బిగించిన ఓరుగల్లు పోరు బిడ్డ, తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మెన్ బండా నరేందర్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ 127 వ జయంతి సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్డులో ఉన్న ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..1940 దశకంలో బడుగు బలహీన వర్గాల కోసం, దుక్కి దున్నే వాడిదే భూమి అనే నినాదంతో భూస్వాములకు, రజాకార్ల అఘాయిత్యాలకు, ఆగడాలకు అడ్డుకట్ట వేసిన చిట్యాల ఐలమ్మ సబ్బండ వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగంచేసి తన కుటుంబాన్ని కోల్పోయిందన్నారు. నిజాం పాలన, విస్నూరు దేశ్‌ముఖ్‌కి వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు ఐలమ్మ అని పేర్కొన్నారు. ఒకవైపు సాయుధ పోరాటం చేస్తూనే, మరోవైపు అమ్మలాగా ఉద్యమకారులకు అన్నం పెట్టి ఆదరించిన మహనీయురాలు చాకలి ఐలమ్మ అని గుర్తు చేశారు. అలాంటి వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి జయంతి సభలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఐలమ్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ వినరు కష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్‌గౌడ్, డీఎస్పీ నర్సింహారెడ్డి, ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్, చిర్ల శ్రీనివాస్, వన్‌టౌన్ సిఐ రౌతు గోపి, రజక సంఘం నాయకులు కొండూరు సత్యనారాయణ, చిలక రాజు చెన్నయ్య, బీసీ సంఘం నాయకులు చక్రహరి రామరాజు, వైద్యుల సత్యనారాయణ, తదితరులు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జనయిత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...
జనయిత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షులు కంబాల శివలీల, కార్యవర్గ సభ్యులు సుల్తానా, తదితరులు పాల్గొన్నారు.
తహశీల్దార్ కార్యాలయంలో...
వీరనారి ఐలమ్మ 127 వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ బండ కవిత, డిప్యూటీ గిర్దావర్ అమర్నాథ్ రెడ్డి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
12 వ బెటాలియన్‌లో...
12 వ బెటాలియన్ టీఎస్ఎస్పీ అన్నెపర్తిలో కమాండెంట్ సాంబయ్య ఆద్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 127 వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు నర్సింగ్ వెంకన్న, తిరుపతి, యూనిట్ డాక్టర్ నాగలక్ష్మి, బెటాలియన్ ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, మినిస్ట్రియల్ స్టాప్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎంజీయూలో..
నల్లగొండకలెక్టరేట్ : వీరనారి ఐలమ్మ పోరాట చరిత్ర తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాయకమని ఉపకులపతి ఆచార్య చొల్లేటి గోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఎంజీయూలో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వోఎస్డీ డాక్టర్ అలవాల రవి, ఐక్యు ఏసి డైరెక్టర్ డాక్టర్ శ్రీదేవి, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో..
చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు అని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో మోతిలాల్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో...
చాకలి ఐలమ్మ 127 వ జయంతి సందర్భంగా టీఎన్జీవో ఆధ్వర్యంలో సోమవారం సాగర్ రోడ్డులో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు శ్రావణ్ కుమార్, నాయకులు, టీజీవో వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కే. కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
నాంపల్లి : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ 127వ జయంతోత్సవాలు నాంపల్లి మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నాంపల్లి తహశీల్దార్ లాల్ బహుదూర్ శాస్త్రి హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి అధ్యక్షుడు కోరె సాయిరాం, రజక సంఘం మండల నాయకులు నాంపల్లి సత్తయ్య, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు నారాయణ, నాంపల్లి గ్రామపంచాయతీ సెక్రెటరీ సత్తార్, ఎ.వెంకటేశ్వర్లు, రాజు, కే.శ్రీకాంత్, నాంపల్లి గిరిబాబు, వి సుధాకర్, త్రివేణి సంగమం సోషల్ వర్క్స్ చైర్మన్ ఈద శేఖర్, నాంపల్లి సతీష్, తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ :తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 127వ జయంతి సందర్భంగా సోమవారం వివిధ పార్టీల నాయకులు సంఘాల ప్రతినిధులు ఘన నివాళులర్పించారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మెన్ తిరునగరు భార్గవ్, హనుమాన్ పేటలో ఉన్న ఐలమ్మ విగ్రహానికి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, రజక సంఘం అధ్యక్షులు ఎర్రబెల్లి దుర్గయ్య తదితరులు ఐలమ్మకు నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిపి నూకలు సరళ హనుమంత రెడ్డి, జెడ్పిటిసి తిప్పన విజయ సింహ రెడ్డి, తహసిల్దార్ అనిల్ కుమార్, విజేత డిగ్రీ కాలేజ్ లో ప్రిన్సిపాల్ దనుజయ్య, ఆయా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.