Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస రాష్ట్ర కార్యదర్శి నారిఐలయ్య
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఆహర సబ్సిడీలను ఎత్తివేస్తే మోడీ ప్రభుత్వానికి పతనం తప్పదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారిఐలయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆహర సబ్సిడీలపై కొలతలు పెట్టాలని చూస్తుందని, వెంటనే ఆ విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం త్రిపురారం మండల 4వ మహసభ వల్లపు వెంకటయ్య అధ్యక్షతన మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ మహాసభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. మోడి తప్పుడు విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు అద్దు అదుపు లెకుండ విపరీతంగా పెరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో బిజెపి ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. నిరుద్యోగ యువతకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసి అర్హులైన వారందరికీ ఉపాది కల్పిస్తామని చెప్పి ఎనిమిది ఏండ్లు గడుస్తున్న కొత్త ఉద్యోగాలు కల్పించక పోగా ప్రభుత్వ రంగ సంస్థల మూసి, మరికొన్ని అమ్మి వేసి ఉపాధీ లేకుండ చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికి ఆహార భద్రత కల్పిస్తామని అలాగే పేదలకు ప్రభుత్వ విద్య వైద్యంకు అదిక నిధులు కేటాయించి పటిష్ఠ పరుచుతనని చెప్పిన మాటలకు చెతలకు పొంతన లెకుండ పోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు దైదాశ్రీను, వ్యకాస నాయకులు రెమిడాల రాములు, అన్నెపాక తిరుపతమ్మ, కుంచేం బిక్షం, సండ్రాల మట్టయ్య, వలసాని రాములమ్మ, వల్లపుదాసు బుజ్జమ్మ, మేకల మధు, ఈటవెంకన్న, తదితరులు పాల్గొన్నారు. అనంతరం13మందితో నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా రెమిడాల రాములు, ఉపాద్యక్షురాలుగా అన్నెపాక తిరుపతమ్మ, కార్యదర్శిగావల్లపు వెంకటయ్య, సహయ కార్యదర్శిగా కొంచెం బిక్షంలను ఏకగ్రివంగా ఎన్నుకున్నారు.