Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్పల్లి
అంగన్వాడి టీచర్లు ప్రతి అంశంపై అవగాహన పెంచుకో వాలని జిల్లా పరిషత్ చైర్మెన్ బండా నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా గర్బిణీలకు సామూహిక శ్రీమంతాలు, ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్న ప్రాసన, అక్షరభ్యాసం, బతుకమ్మ పండుగ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్బస్త శిశువులు పౌస్టిక ఆహార లోపం వలన అంగవైకల్యంతో జన్మించకుండ గర్బిణి స్త్రీలకు అంగన్ వాడి కేంద్రంలో పౌస్టిక ఆహారాన్ని అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు పుల్లెంల ముత్తయ్య, కనుకు అంజయ్య, శ్రీనివాస్ రెడ్డి, జయలక్ష్మి, స్థానిక సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి, నక్కలపల్లి సర్పంచ్ ఈద మాదవి, అధికారులు ఎంపీడీవో యాదగిరి, ఇంచార్చ్ తాసిల్దార్ మురళి మోహన్, సిడిపిఓ అగా అస్ర అంజుమ్, తదితరులు పాల్గొన్నారు.