Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
మునుగోడులో బీఎస్పీని గెలిపిస్తే యువతకు ఉచిత విద్యను అందిస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని మల్లారెడ్డిగూడెం, గుజ్జ,లింగం వారి గూడెం, సాయిగోని బాయి, పుట్టపాక, బట్టోని బాయి, పుర్లకుంట, దేవి రెడ్డి గూడెం, కొత్తగూడెం, నారాయణపురం గ్రామాల్లో నిర్వహిం చిన బహుజన రాజ్యాధికార యాత్రలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి మద్యం పంచి పేదలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.ప్రజలంతా మునుగోడు వైపు చూస్తుంటే,మునుగోడు ప్రజలు ఏనుగు వైపు చూస్తున్నారని తెలిపారు.రాష్ట్ర ప్రజలంతా దొరల పాలన నుండి విముక్తి, మార్పు కోరుకుంటున్నారన్నారు. స్వాతంత్య్రం కోసం,తెలంగాణ ఆత్మ గౌరవం కోసం కొట్లాడిన చాకలి ఐలమ్మ లాంటి వారిని చిట్టెలుక అంటూ అవమానపరుస్తున్నారని విమర్శించారు.అందుకే ఐలమ్మ పోరాట స్పూర్తితో దొరల పాలన అంతం చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు ఊదరి సైదులు,పల్లె లింగస్వామి,కత్తుల పద్మ యాదవ్,నర్సింహ,యాదగిరి,నర్సింహ,అధ మహిళలు,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.