Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
బ్రహ్మంగారి గుట్టపైన ఉన్న దుర్గామాత దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం కనకదుర్గ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానిక బ్రహ్మంగారి గుట్టపై దుర్గామాతకు తొలిపూజ నిర్వహించి మాట్లాడారు. అక్కడి ప్రదేశాలను పరిశీలించిన కంచర్ల దుర్గామాత దేవాలయాన్ని బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ తరహాలో అభివృద్ధి పరచవలసిన అవసరం ఉందన్నారు. అద్భుతమైన ఆహ్లాదకరమైన, ఆధ్యాత్మిక, వాతావరణం కలగజేసే విధంగా ఈ ప్రాంతం ఉందని ఇక్కడ పూర్తిస్థాయిలో అభివృద్ధి పరచవలసి ఉందని తెలిపారు. ఇందుకు తనవంతుగా 50 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ప్రభుత్వం ద్వారా మరో రెండున్నర కోట్లతో ఆలయ పునరుద్ధరణ చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వచ్చి ఈ ప్రాంతాన్ని మరింత అద్భుతమైన రీతిలో అభివృద్ధి పరుచుటకు నిధులు కేటాయించే విదంగా ప్రయత్నం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కౌన్సిలర్లు ఎడ్ల శ్రీనివాస్‌యాదవ్, వట్టిపల్లి శ్రీనివాస్, గోగుల శ్రీనివాస్‌యాదవ్, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు నేతి రఘుపతి, పట్టణ పార్టీ కార్యదర్శి బోనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.