Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ చీరలను సోమవారం మున్సిపల్ చైర్మెన్ చందమల్ల జయబాబు అధ్యక్షతన శాసనమండలి చైర్మెన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మహిళలకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నేరేడుచర్ల మున్సిపాలిటీకి అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ నేరేడుచర్ల మున్సిపాలిటీని రూ.35 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు.రాష్ట్రంలో రాష్ట్ర సంక్షేమపథకాలు ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో వెళ్లాయన్నారు.ప్రతిపక్షాలు అభివృద్ధి విషయంలో ఆటంకాలు సష్టించి కోర్టులో కేసులు వేయగా,ఆ కేసులపై స్టే తెచ్చి అభివృద్ధి చేస్తున్నామ న్నారు.సాగర్ ఎడమ కాల్వకు గండి పడగా మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో 20 రోజుల్లో గండిని పూడ్చివేశామన్నారు.మరో నాలుగునెలల్లో నేరేడుచర్ల మున్సిపాలిటీ రింగ్‌రోడ్డు పనులు పూర్తి చేస్తామన్నారు.అభివృద్ధిలో భాగంగా ఆటోనగర్, స్థానిక పార్కుల పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.అంతకుముందు స్థానిక విజయదుర్గ ఆలయంలో దేవీ నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు జరిగే ప్రత్యేకపూజలో ఆయన పాల్గొన్నారు. అక్కడి పట్టణ కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద చాకలి ఐలమ్మ 127 వ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు లేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు, మున్సిపల్వైస్ చైర్మెన్ చల్లా శ్రీలతరెడ్డి, కౌన్సిలర్లు,పీఏసీఎస్ చైర్మెన్ దొండపాటిఅప్పిరెడ్డి, వ్యవసాయమార్కెట్ చైర్మెన్ ఇంజమూరి యశోధరాములు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అరిబండి సురేష్‌బాబు,అనంతశ్రీనివాస్గౌడ్, శాఖ గ్రంథాలయం చైర్మెన్ మార్కండేయులు,వల్లంచెట్ల రమేశ్‌బాబు, నాగండ్ల శ్రీధర్, చిత్తలూరి సైదులు, ఆకారపు వెంకటేశ్వర్లు, వింజమూరు మల్లయ్య, శ్రీను, కొమ్మరాజు వెంకట్ పాల్గొన్నారు.