Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భూదాన్‌పోచంపల్లి
టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మండలానికి అధిక నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్, పింఛన్లు, ఉచిత విద్యుత,్ రైతుబంధు దళిత బంధు వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం వంక మామిడి గ్రామం లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మచ్చ నరసింహ. తోపాటు 100 మంది పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం.కటిక రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు బాలరాజు కుమారుడు చనిపోయిన కుటుంబాలను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని నింపారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి , ఎంపీపీమాడ్గుల ప్రభాకర్ రెడ్డి జెడ్పీటీసీ కోట పుష్పలత . వైస్ చైర్మెన్బాత్క లింగస్వామి పాల్గొన్నారు.