Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గడప గడపకు ప్రచారంలో పాల్వాయి స్రవంతి
- నిత్యావసర ధరలు పెంచిన పార్టీ బీజీపీ
నవతెలంగాణ-చౌటుప్పల్రూరల్
దేశంలో ప్రజలను ఇబ్బందులు పెడుతున్న బీజేపీ పార్టీలోకి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదు. మునుగోడులో బిజిపి కి స్థానం లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు.మండలంలోని జై కేసారం, అసోనిగూడెం గ్రామాల్లో గడప గడపకు కాంగ్రెస్ పేరుతో ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం ప్రారంభించారు. గడప గడపకు తిరుగుతూ మునుగోడులో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.420 ఉంటే నేడు మోడీ ప్రభుత్వంలో రూ.1180 అయ్యిందన్నారు. బీజేపీప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచిందన్నారు. మునుగోడు నియోజకవర్గం లో రాజగోపాల్ రెడ్డి గెలిచి ప్రజలకు చేసింది ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ పార్టీనీ, మునుగోడు ప్రజలను మోసం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. తన తండ్రి హయంలో మునుగోడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అభివద్ధి జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను, కార్యకర్తలను డబ్బులు సంచులతో కొనుగోలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి డబ్బు రాజకీయాలు చేస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్ముకుని ఎన్నికల బరిలో నిలిచిందని స్పష్టం చేశారు. మహిళగా పోటీ చేస్తున్న నాకు మహిళల నుండి అపూర్వ స్పందన లభిస్తుందని తెలిపారు. ఒక్కసారి అవకాశం ఇచ్చే గెలిపించాలని కోరారు. జై కేశవరం గ్రామంలో అనారోగ్యానికి గురైన పోలోజు విశ్వనాథచారికి, శాలువాది యాదయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ఆకుల ఇంద్రసేన రెడ్డి,నాయకులు ముప్పిడి సైదులు, తిరుపతి రవీందర్, సుర్వి నర్సింహ,జిండ్రు అంజిరెడ్డి, పొట్ట సత్యనారాయణ, గ్రామ ఉప సర్పంచ్ బండమీది యమునా యాదగిరి, గ్రామ నాయకులు తాటి రవి, మైలారం సైదులు, బండిమీద సైదులు, మల్లేష్,రాజీవ్, శేఖర్, అమర్, గంగాదేవి జ్యోతి, అఖిల,సంధ్య తదితరులు పాల్గొన్నారు .