Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భూదాన్‌పోచంపల్లి
ప్రస్తుతం దేశంలో మతోన్మాదం పెరిగి యువతను చెడు మార్గం వైపు నడిపిస్తుందని దీనిమీద భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాటాల్లోకి రావాలని మతోన్మాదానికి వ్యతిరేకంగా యువత కదలాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ అన్నారు. మంగళవారం భగత్ సింగ్ 115వ జయంతి సందర్భంగా పట్టణ కేంద్రంలో గల కోదండరామిరెడ్డి భవనంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు పండ్లు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యంగా ఉన్న యువతను మతం పేరుతో కులం పేరుతో తేడాలు తీసుకొచ్చి మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఐక్యతను దెబ్బతీస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు పగిల్ల లింగారెడ్డి, మంచాల మధు, డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు దుబ్బాక జగన్, రామసాని అనిల్, చుక్క శ్రీకాంత్,నారి బాలకృష్ణ, బొడ్డు సాయి, పెండం రాజు, మోరే కుమార్, ఏనుముల క్రాంతి, దేశపాక సన్నీ, తదితరులు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : సామ్రాజ్యవాదానికి ,మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడటమే నిజమైన దేశభక్తి అని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి కాసుల నరేష్ అన్నారు. భగత్ సింగ్ 115వ జయంతి సందర్భంగా సోమవారం స్థానిక ఎస్సార్ జూనియర్ కళాశాలలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో డీివైఎఫ్‌ఐ నాయకులు బోనగిరి గణేష్ ,ఎస్ఎఫ్ఐ నాయకులు ఆది సుర్జిత్ ,వంటేరు ఇందు,కొరుటూరి శృతి,నారాయణ సంతోషి,జంగా రేఖ, తీగ సంధ్య,దాసరి రాజేష్ ,కోళ్ల శ్రవణ్ మామిడాల ఈశ్వర్,నార సాయికుమార్,నమిల సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.
వలిగొండ : భగత్ సింగ్ 115వ జయంతి సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ,డీవైఎఫ్ఐ పులిగిల్ల గ్రామ శాఖ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ పంపిణీ చేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెమినార్ నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాజీ డివైఎఫ్ఐ నాయకులు వాకిటి వెంకటరెడ్డి ,మండల నాయకులు కవిడి సురేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కళాశాల అధ్యక్షకార్యదర్శిలు పోలేపాక విష్ణు,భారత్,మహేష్, సిరివెన్నెల,స్వాతి,పూజ తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట : దేశ స్వాతంత్య్రం కోసం చిన్న వయసులో ప్రాణాలర్పించిన భగత్ సింగ్ స్పూర్తితో విద్యార్థులు మతోన్మాదంపై, విద్యారంగా విద్యార్థుల సమస్యలపై ఉద్యమించాలని ఎస్ఎఫ్ఐ మండల అద్యక్ష,కార్యదర్శులు మేకల జలెందర్, బండ్ల పవణ్ కళ్యాణ్ అన్నారు. భగత్ సింగ్ 115వ జయంతి సందర్బంగా మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సభను నిర్వహించి జోహార్లు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ యువతలో చైతన్యం రగిలించేందుకు ప్రాణాలను తృణప్రాయం చేసిన వీరయోదుడు భగత్ సింగ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గంటెపాక శివ, మధు భాబు, గుండాల నరేష్, అప్పం పల్లవి, సిందూ, స్వప్న, ఇటుకాల ఉదరు, రాజు తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ : దేశంలో పెరిగిపోతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా యువత పోరాటాలు నిర్వహించాలని డీవైఎఫ్ఐ జిల్లా సహాయకార్యదర్శి ఎమ్‌డి.ఖయ్యుమ్పాషా తెలిపారు. మంగళవారం మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో భగత్‌సింగ్ 115వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నేటి తరం యువత మతం, మతోన్మాదానికి ఆకర్షితులు కాకుండా దేశ భవిష్యత్తు తరాల కోసం భగత్‌సింగ్ స్ఫూర్తితో పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, సీపీఐ(ఎం) మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్, డీవైఎఫ్ఐ డివిజన్ మాజీ అధ్యక్షులు బండారు నర్సింహా, నాయకులు దేప రాజు, దండ అరుణ్‌కుమార్, గోశిక కరుణాకర్, ఎమ్‌డి.ఖాసీమ్, మహేశ్‌కుమార్, గంట శంకర్‌రెడ్డి, ఆకుల ధర్మయ్య, ఎమ్‌డి.ముజాహిద్, బత్తుల దాసు, చీకూరి ఈదయ్య, మొగుదాల రాములు పాల్గొన్నారు.