Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ఆలేరు నియోజకవర్గంలో శిథిలావస్థలో ఉన్న గ్రామపంచాయతీ భవనాలకు కొత్త భవనములు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతమహేందర్రెడ్డి మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు. మోటకొండూరు మండలం మాటూరు నుండి వర్టూరు వరకు నాలుగు కిలోమీటర్ల దూరం రూ.కోటి తో బీటీ రోడ్డు రెన్యూవల్ మంజూరు చేయాలని కోరారు . యాదగిరిగుట్ట పీడబ్య్లుడీ రోడ్డు నుండి పెద్ద కందుకూరు వరకు రెండు కిలోమీటర్ల దూరం 45 లక్షలతో నిర్మాణ పనులకు అనుమతి , తుర్కపల్లి నుండి మంచిరోని మామిళ్ళ గ్రామం వరకు 73 లక్షలతో పనులు చేపట్టాలని కోరారు. మర్యాల సబ్స్టేషన్ నుండి చీకటి మామిడి వరకు వయా కండ్లకుంట తండా, చౌదర్పల్లి గ్రామాల మీదుగా 61 లక్షలతో బీటీ రోడ్ రెన్యువల్ చేయుటకు మంజూరు చేయాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.