Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
పట్టణంలోని 22వ వార్డులో మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులు రూ.2.50 లక్షలతో చేపట్టిన సీసీ డ్రైన్, కల్వర్ట్ నిర్మాణ పనులకు మంగళవారం మున్సిపల్ చైర్మెన్ ఎన్నబోయిన అంజనేయులు , వైస్ చైర్మెన్ చింతల కిష్టయ్య , వార్డు సభ్యులు బొర్ర రాకేష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమములో మునిసిపల్ అధికారులు, నాయకులు నల్లమాస వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
పారిశుధ్యపనుల పరిశీలన పట్టణంలోని 34 వార్డులో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను మంగళవారం మున్సిపల్ చైర్మెన్ ఎన్నబోయిన అంజనేయులు పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట నాయకులు కోళ్ల గంగాధర్ ఉన్నారు.
ఫ్లోరింగ్ పనుల పరిశీలన.
పురపాలక సంఘ కార్యాలయ భవనంపై రూ.4.00 లక్షలతో చేపట్టిన ఫ్లోరింగ్ పనులను చైర్మెన్ ఎన్నబోయిన అంజనేయులు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో గౌరవ వార్డు సభ్యులు పంగరెక్క స్వామి, నాయకులు శ్రీ ఇట్టబోయిన గోపాల్ , మునిసిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.