Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వాలు కనీస వేతనాలు చెల్లించకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నాయని సీఐటీయు జిల్లా కార్యదర్శి దాసరి పాండు విమర్శించారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో మున్సిపల్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు కార్మిక చట్టాలు, ఈఎస్ఐ, పీఎఫ్, పండుగ సెలవులు వంటి సౌకర్యాలు కల్పించకుండా పని చేయించుకుంటున్నారన్నారు. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న కనీస వేతన జీఓ 11 అమలుచేసి కేటగిరిల వారిగా వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నాయన్నారు. కనీస వేతనాలు వెంటనే చెల్లించాలని, అధికారుల వేదింపులు ఆపాలని డిమాండ్‌చేశారు. ఈ సమావేశంలో సీఐటీయు జిల్లా సహాయకార్యదర్శి ఎమ్‌డి.పాషా, కార్మికులు బోదుల నర్సింహా, జ్యోతి, అంజయ్య, లక్ష్మీ, శంకరయ్య, లక్ష్మమ్మ, వెంకటయ్య, స్వప్న, ముత్యాలు, ఊషయ్య పాల్గొన్నారు.