Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు పాటుపడుదాం
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ- భువనగిరి రూరల్
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన ఆశయ సాధన కోసం అందరూ పాటుపడాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వారు నిరంతరం పాటుపడ్డారన్నారు. జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, స్థానిక సంస్థల జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర సాధనకు అహర్నిశలు కృషి చేస్తూ కూడా ఒక వైపు బడుగు బహుజనుల అభ్యున్నతి కోసం నిరంతరం తపించారని, తన చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం పోరాడారని అన్నారు. ఆయన జీవితాన్ని మూడు దశలుగా చూడొచ్చన్నారు. మహాత్మాగాంధీ బోధనలకు ఆకర్షితులై స్వాతంత్య్య్ర పోరాటంలో పాల్గొన్నారని, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని, తొలి దశ తెలంగాణ పోరాటాన్ని సమర్దిస్తూ చురుకుగా పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి యాదయ్య, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి జయపాల్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సునంద, జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సత్యనారాయణ, కలెక్టరేటు పరిపాలన అధికారి ఎం.నాగేశ్వరా చారి, సామాజికవేత్త రామచంద్రయ్య, జాతీయ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీరమోహన్, చేనేత సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రావుల రాజు, జిల్లా బీసీ హక్కుల సాధన సమితి ప్రధాన కార్యదర్శి ఏశాల అశోక్, బీసీ ఉద్యోగ సంఘం అధ్యక్షులు మాటూరు అశోక్, కొడాలి వెంకటేశ్, బండి జంగమ్మ, బీసీ సంఘాల ప్రతినిథులు పాల్గొన్నారు.
రాజీలేని పోరాట యోధుడు లక్ష్మణ్ బాబూజీ
భూదన్‌పోచంపల్లి: బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి కొండ లక్ష్మణ్ బాపూజీ అని భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు మంగళవారం కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి.ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ నిజాం నియంతృత పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రైతంగా.సాహిదా పోరాటం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం కోసం వెనుకబడిన తరగతుల ఉద్యమ చేనేత సహకార ఉద్యమం చివరి వరకు మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు కొండ లక్ష్మణ్ పోషించిన పాత్ర విడదీయలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి జెడ్పీటీసీకోట పుష్పలత మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి శ్రీనివాస్.వైస్ ఎంపీపీ పాక వెంకటేశం మున్సిపల్ వైస్ వచైర్మెన్ లింగస్వామి మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి ఫౌండేషన్ చైర్మెన్ బడుగు దానయ్య రాపోల్ జ్ఞానేశ్వర్ తడక వెంకటేశం తడక రమేష్ భారత లవ కుమార్ వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ : రాష్ట్ర నాయకులు ఆచార్య కొండా లక్ష్మణ్బాపూజీని ఆదర్శంగా తీసుకోవాలని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ 107వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బాపూజీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తొలి మలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దివంగత నేత కొండా లక్ష్మణ్‌బాపూజీ అన్నారు. రాజకీయ నాయకుల్లో ఆదర్శ నాయకుల్లో మొట్టమొదటి వ్యక్తి బాపూజీ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని కోల్పోయిన మొట్టమొదటి వ్యక్తి అన్నారు. తెలంగాణ ఉద్యమం చేసిన వారిలో కొంతమంది ముఖ్యమంత్రులు, మంత్రులు అయ్యారని గుర్తుచేశారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేసిన వ్యక్తులు ప్రజల గుండెల్లో స్థిరంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ వెన్‌రెడ్డి రాజు, వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు బడుగు లక్ష్మయ్య, చిక్క నర్సింహా, కందగట్ల బిక్షపతి, గోశిక రవి, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.