Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన వేతన ఒప్పందం చేసుకోవాలి
- సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దాసరి పాండు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి
నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్
ప్రతిష్ట ఇండిస్టీస్ యాజమాన్యం మొండి వైఖరి వీడి కార్మికులతో వేతన ఒప్పందం చేసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండులు డిమాండ్ చేశారు. కార్మికులు చేపట్టిన సమ్మె ఆరవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11 నెలలుగా ప్రతిష్ట ఇండిస్టీస్ యాజమాన్యం కార్మికులతో వేతన ఒప్పందం చేసుకోకుండా ఇబ్బందులకు గురిచేయడం సరైన పద్ధతి కాదన్నారు. వందల కోట్ల లాభాలు పొందుతున్న కూడా కంపెనీ కార్మికులకు వేతన ఒప్పందం చేసుకోవడానికి కలిగే ఇబ్బంది ఏంటో చెప్పాలన్నారు. కంపెనీలో 300 మంది పైగా కార్మికులు పనిచేస్తున్న కూడా కనీసం క్యాంటీన్ సౌకర్యం లేదని అన్నారు. కార్మికులు విధిలేని పరిస్థితుల్లో సమ్మె చేయాల్సి వస్తుందని తెలిపారు. కంపెనీ యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.
ఘనంగా భగత్ సింగ్ 115వ జయంతి
ప్రతిష్ట ఇండిస్టీస్ కార్మికులు భగత్ సింగ్ 115 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ఉరికంబాలెక్కిన యువకిశోరం భగత్ సింగ్ అని అన్నారు. భగత్ సింగ్ చరిత్రను నేటి పాలకులు వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. భగత్ సింగ్ జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఎండి పాషా, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి బండారు నరసింహ, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పల్లె శివ, డీవైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఖయ్యుం, యూనియన్ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశం, యూనియన్ నాయకులు దూసరి వెంకటేశం, బిక్షపతి, సత్యనారాయణ,యాదయ్య, బుచ్చమ్మ, లలిత,పార్వతమ్మ, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.