Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మునుగోడు నియోజకవర్గంలో రానున్న శాసనసభ ఉప ఎన్నికల్లో మునుగోడు గడ్డపై టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు తొర్పునూరి నర్సింహాగౌడ్ అధ్యక్షతన పట్టణ యువజన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. మునుగోడులో ప్రజలు రాజగోపాల్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గం పది సంవత్సరాలు వెనుకబాటుకు గురైందన్నారు. రాజగోపాల్‌రెడ్డి కేవలం తన వ్యాపారం, సొంత లాభం కోసమే బీజేపీలోకి వెళ్లారన్నారు. మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మునుగోడు అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు. ఈ సమావేశంలో నాయకులు గంట నరేంద్రసాగర్, పబ్బు వినోద్, రాకేశ్‌రెడ్డి, మున్న, కానుగు శివ, రెడ్డబోయిన మహేశ్, సంగిశెట్టి శివ, కిరణ్‌రెడ్డి, శివచారి, రాజు, శివకృష్ణ, బాలరాజు, శేఖర్, లింగస్వామి, జానీయాదవ్, బాలవృష్ణ పాల్గొన్నారు.