Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-రాజాపేట
రాజాపేట మండలం రాఘునాథపురం గ్రామానికి మండలకేంద్రంగా చేసేందుకు అన్ని అర్హతులున్నాయని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. రఘునాథపురం గ్రామాన్ని మండలకేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలేనిరాహార దీక్షలు 49వ రోజు చేరుకున్నాయి. మంగళవారం దీక్షా శిబిరాన్ని చెరుపల్లి సందర్శించి మద్దతు తెలిపి మాట్లాడారు. భౌగోళికంగా, రెవెన్యూ పరంగా అన్ని రకాలుగా అర్హతలు ఉన్న రఘునాథపురం గ్రామాన్ని వెంటనే మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు..ఈ మండలాన్ని సీఎం దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని కోరారు .రఘునాథపురం మండలం న్యాయమైన కోరికని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి గాడిపల్లి శ్రవణ్, ఎంపీటీసీ బుడిగే రేణుక పెంటయ్య గౌడ్ ,ఉప సర్పంచ్ పల్లె ప్రవీణ్ ,గుర్రం సిద్ధిరాములు ,రామిండ్ల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.