Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మఠంపల్లి
మండలంలోని గిరిజనులందరికీ ప్రభుత్వమిచ్చే సబ్సిడీ రుణాలివ్వాలని సీపీఐ(ఎం) జిల్లాకమిటీసభ్యుడు భూక్యా పాండునాయక్,మండలకార్యదర్శి మాలోత్బాలూనాయక్ అన్నారు.ఈ విషయమై మంగళవారం ఎంపీడీఓ మామిడిజానకిరాములుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీ కార్పొరేషన్ రుణాలను ఎంపీపీ, జెడ్పీటీసీ, ఇతర ప్రజాప్రతినిధుల బంధువులకు ఇచ్చేందుకు ప్రతిపాదనలు పంపారని విమర్శించారు.అనర్హులను తొలిగించి అర్హులైన వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సైదా, శంభయ్య, హరియా పాల్గొన్నారు.