Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
దళితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితబాంధువునిగా మారారని టీఆర్ఎస్ జిల్లా యూత్ నాయకులు కందుకూరి ప్రవీణ్ అన్నారు.మంగళవారం ఆయన మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం పీపుల పహాడ్ గ్రామంలోని దళిత బస్తులు గడపగడపకు మన కేసీఆర్ కార్యక్రమం చేపట్టి దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ పాట పడుతున్న విధానం గురించి, ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలను ముఖ్యంగా దళితబంధు పథకం గురించి వివరించి దళితులను చైతన్యపరిచారు.బడుగు బలహీన వర్గాలను మైనార్టీలను అణగదొక్కే, దీనంగా చూసే,వారి బతుకులతో చెలగాటమాడే మతోన్మాద బీజేపీ వైపు మనం ఉండొద్దని సూచించారు.రానున్న రోజుల్లో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం అమలవుతుందన్నారు.ప్రజలంతా కేసీఆర్ చిత్తశుద్ధిని గమనించి ఆయన్ను ఆశీర్వదించాలని కోరారు.దేశస్థాయిలో ఆయన్ను ముందుకు పంపేందుకు ఆయన వెన్నంటి ఉండాలని కోరారు.మునుగోడు నియోజకవర్గంలో కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు.