Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
దేశంలో రానున్న కాలంలో అన్ని రైతన్న పోరాటాలు ఉంటాయని తెలంగాణ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు బుర్రి శ్రీరాములు అన్నారు.మంగళవారం గరిడేపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం మండల మహాసభ భిక్షమయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఎనిమిదేండ్ల మోడీ పరిపాలనలో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.దొడ్డిదారిన తీసుకువచ్చిన మూడు వ్యవసాయచట్టాలను రైతుల పోరాటం ద్వారా తిరిగి వెనక్కు తీసుకున్నారన్నారు. ప్రస్తుతం మోటార్లకు మీటర్లు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారని ఆయన ఆటలు సాగనివ్వబోమన్నారు.దేశవ్యాప్తంగా మీటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం రాబోతుందని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.పాలకులు బడా పారిశ్రామికవేత్తలకు రూ. వేల కోట్ల రాయితీలు ఇస్తున్నారన్నారు. ఏఐకేఎస్ ఆధ్వర్యంలో దేశంలోని నలుమూలల రైతాంగ పోరాటాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయన్నారు. రైతులకు గతంలో ఇచ్చే వ్యవసాయ పరికరాలు ఇవ్వడంలేదని ఎరువుల ధరలను నియంత్రించ లేదని, రైతాంగ సమస్యలపై సంఘం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి పల్లె వెంకటరెడ్డి, సహాయకార్యదర్శి దుగ్గి బ్రహ్మం, సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్కె.యాకుబ్, తెనాల సోమయ్య, బి.శ్రీనివాస్, అర్జున్, లంబడి భిక్షం, మీసాల మట్టయ్య, దోసపాటిసుధాకర్, మోహన్‌రెడ్డి, వీరారెడ్డి పాల్గొన్నారు.