Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ మోహన్‌రావు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
మహిళా చట్టాలపై అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా మేనేజ్మెంట్ కమిటీ,సఖీ సెంటర్,వికలాంగుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.మహిళలకు చట్టాలైన గృహహింస, నిర్భయచట్టం వంటి చట్టాలపై పాఠశాలలు, కాలేజీలలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.జిల్లాలో మహిళలకు పిల్లలకు సంబంధించిన విషయాలలో ఎలాంటి సహాయ సహకారాలు అందించడం కోసం జిల్లా యంత్రాంగం ముందుంటుందని హామీ ఇచ్చారు. లీగల్ అడ్వయిజర్‌కు సంబంధించిన విషయం నియామకం త్వరితగతిన పూర్తయ్యేటట్టు చర్యలు తీసు కుంటామన్నారు.అనంతరం మొట్ట మొదటిసారిగా సఖి సెంటర్ వారు అందిస్తున్న ఐదురకాల సేవలకు గురించి వివరించి వివిధ కేటగిరీలు అనగా కుటుంబహింసకు గురైన, లైంగిక దాడుల హింసకు గురైన మహిళలు, పిల్లలు, బాల్య వివాహ బాధిత పిల్లలు, ఫోక్సో బాధితులు, తప్పిపోయిన, కిడ్నాప్‌కు గురైన తదితర సమస్యలతో ఉన్న మహిళల పిల్లలకు ఆశ్రయం కల్పించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు.తిరిగి వారిని రిహబిలిటేషన్ చేయడం ద్వారా సెప్టెంబర్ 2019 నుండి సెప్టెంబర్ 2022 వరకు 740 మందికి సర్వీసు అందించామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మ,డీఎంహెచ్ఓ కోటాచలం, సీఐ ఆర్.రమణారావు, చైర్మెన్ బాలల సంక్షేమసమితి, డా.రుక్మిణీరావు, డైరెక్టర్ గ్రామ్య రీసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్, రవికుమార్, జిల్లా బాలలపరిరక్షణ అధికారి, హుస్సేన్, సూపరింటెండెంట్ శైలజ, సెంటర్ అడ్మిన్, సఖీ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.