Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతుసంఘం జిల్లా ప్రధానకార్యదర్శి దండ వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ-ఆత్మకూర్‌ఎస్
మద్దతుధరల చట్టం, కొనుగోలు గ్యారంటీ కోసం రైతాంగం ఉద్యమి ంచాలని తెలంగాణ రైతుసంఘం జిల్లా ప్రధానకార్యదర్శి దండ వెంకట్‌రెడ్డి కోరారు.మంగళవారం మండలపరిధిలోని తుమ్మలపెన్‌పహాడ్ గ్రామంలో జరిగిన ఆ సంఘం గ్రామ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు,రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలకు రైతాంగం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.కేంద్రంలోని బీజేపీ పాలనలో రైతుల పరిస్థితి మరింత దిగజారిపోయిందని, పూర్తిగా నష్టాలు, అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.బీజేపీ అవలంబిస్తున్న మతోన్మాద, కార్పొరేటీకరణ విధానాలే ఈ దుస్థితికి కారణమన్నారు.సంక్షోభం నుంచి రైతన్నలు బయటపడాలంటే కేంద్రం కనీస మద్దతు ధర పెంచి, చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సమగ్ర పంటల బీమాను అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. కార్పొరేట్లు, భూస్వాములకే బ్యాంకులు విరివిగా రుణాలు ఇస్తున్నాయని తెలిపారు. ప్రతి రైతుకూ బ్యాంకులు సున్నా శాతం వడ్డీకి లోన్లు ఇచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని రైతాంగం డిమాండ్ చేయాలన్నారు.రైతాంగం ఆర్థికసంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధర ఇవ్వాలని, ప్రతిపంటకూ గిట్టుబాట ధర కల్పించాలని కేంద్రంపై రైతాంగం తిరగబడడం ఒక్కటే మార్గమన్నారు.అనంతరం గ్రామ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.రైతుసంఘం గ్రామ అధ్యక్షులుగా కానుగా ఐలయ్య, కార్యదర్శిగా దేవరకొండభిక్షంను ఎన్నుకున్నారు.వీరితో పాటు మరో 10 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, తెలంగాణ రైతుసంఘం మండల నాయకులు సోమిరెడ్డి దామోదర్‌రెడ్డి, దండ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బెల్లంకొండ మాణిక్యం, మోరపాక సైదులు, వరికుప్పలభిక్షం, ఎరగాని అంజయ్య, కానుగు దుర్గయ్య, బత్తిని భారతమ్మ, మాచర్లసోమయ్య పాల్గొన్నారు.