Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్తమానానికి కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తిదాయకం
- విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ఉద్యమాలకు దివంగత మాజీమంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ దిక్సూచి లాంటి వారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నాటి క్విట్ ఇండియా మూమెంట్ మొదలుకొని వేరు తెలంగాణా వరకు సాగిన ఉద్యమాలలో ఆయన భాగస్వామ్యం విస్మరించలేనిదని ఆయన కొనియాడారు.లక్ష్మణ్‌బాపూజీ 107వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసప్రాంగణంలో బాపూజీ చిత్రపటానికి మంత్రి పూలమాలలేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ 1941 లో జాతిపిత మహాత్మాగాంధీని కలసిన ప్రేరణతో 1942 లో జరిగిన క్విట్ ఇండియా మూమెంట్ మొదలు కొని నిన్నటి వేరు తెలంగాణా ఉద్యమం వరకు ఆయన పోషించిన పాత్ర స్ఫూర్తిదాయకంగా నిలిచింద న్నారు.రజాకార్లకు వ్యతిరేకంగా 1947 నుండి 1948 వరకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణా సాయుధ పోరులో ఆయన పాత్ర అనిర్వచనీయమైందన్నారు.1952లో ముల్కి నిబంధనలను వ్యతిరేకిస్తూ సాగిన ఉద్యమం తో పాటు 1969 లో మొదలైన తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తొలి ఉద్యమం నుండి మొదలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన మలిదశ తెలంగాణా ఉద్యమం వరకు ఆయన పాత్ర ఆమోఘమైనదన్నారు.అటువంటి మహానేత గురించి ఒక్కటే మాటలో చెప్పాలి అంటే ఉద్యమాలకు దిక్సూచి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టెస్కాబ్ వైస్‌చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మెన్ వెన్‌రెడ్డి రాజు పాల్గొన్నారు.
సూర్యాపేటకలెక్టరేట్ : తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అని జిల్లా అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు అన్నారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో జయంతి నిర్వహించిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి అనసూయ,సీపీఓ వెంకటేశ్వర్లు, మార్కెటింగ్ డీఎం రామ్‌పతి, డీఎంహెచ్ఓ కోటాచలం, ఐసీడీఎస్ పీడీ జ్యోతిపద్మ, కార్యాలయ సూపరింటెండెంట్ సుదర్శన్‌రెడ్డి, డి.శ్యామ్, బీసీ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..