Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భక్తుడు ఫిర్యాదుపై స్పందించిన కమిషనర్
- రహస్యంగా డిప్యూటీ కమిషనర్, బృందం తనిఖీలు
- మీడియాకు సమాచారం ఇవ్వడానికి నిరాకరణ
నవతెలంగాణ-నార్కట్ పల్లి
ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెరువుగట్టులో గల శ్రీ పార్వతి స్వామి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో టెండర్ల ప్రక్రియ, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఉద్యోగుల పనితీరు పై దేవదాయ కమిషనర్‌కు అవినీతిపై ఫిర్యాదులు అందాయి. దీంతో రహస్యంగా దేవదాయ కమిషనర్ వరంగల్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్రావుతో పాటు తొమ్మిది మంది సభ్యుల బృందాన్ని చెరువుగట్టు దేవస్థానంలో తనిఖీలకు ఆదేశించారు. దీంతో రెండు రోజులుగా రహస్యంగా రికార్డులను పరిశీలిస్తూ ఉద్యోగుల పనితీరు దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలు, ఆదాయ వ్యయాలపై బృందం ఆరా తీస్తున్నారు.
భక్తుడు ఫిర్యాదు పై స్పందించిన కమిషనర్
శ్రీ పార్వతి జడ ల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వ్యాపారస్తుల దుకాణ సముదాయం, కేటాయింపు వివిధ అంశాలపై నిర్వహిస్తున్న టెండర్ల ప్రక్రియలో దేవదాయ శాఖ పారదర్శకంగా నిర్వహించలేదని సరిగా లేదని భక్తుడు శ్యామ్ ఈ సంవత్సరం మే 13న దేవదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌కు 12 అంశాలపై ఫిర్యాదు చేశారు.
రహస్యంగా వరంగల్ డిప్యూటీ కమిషనర్, 9 మంది బృందం తనిఖీలు
శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో 12 అంశాలు అవినీతి ఆరోపణలతో ఫిర్యాదు రావడంతో పాటు 2016 సంవత్సరం నుంచి సాధారణ రికార్డ్స్ ఆడిట్ కూడా జరగలేదు. దీంతోవరంగల్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంతరావుతో పాటు తొమ్మిది మంది బృందం సోమ, మంగళవారం రహస్యంగా రికార్డు పరిశీలించడం గతంలో పనిచేసిన ఆలయ కమిషనర్ సులోచన ప్రస్తుత సహాయ కమిషనర్ నవీన్‌ను ప్రశ్నిస్తున్నారు. ఆదాయ, వ్యయాలపై ఆరా తీస్తున్నారు. లడ్డు పులిహౌర ప్రసాదాలు తయారీ విక్రయాలపై ఆరా తీసినట్టు తెలిసింది.
వనికి పోతున్న సిబ్బంది..
దేవాలయంలో అవినీతి జరిగిందని భక్తుడు ఫిర్యాదు మేరకు దేవాదాయశాఖ అధికారులు వణికి పోతున్నారు. 2016 సంవత్సరం నుంచి రికార్డుల పరిశీలన ఆడిట్ జరగకపోవడంతో ఏ నివేదిక ఇస్తారో ఏమోనని, ఏ ఒక్క సిబ్బంది కూడా జరుగుతున్న తనిఖీల గురించి మాట్లాడానికి ఇష్టపడడం లేదు.
మీడియాకు సమాచారం ఇవ్వడానికి నిరాకరణ
ఆలయంలో అవినీతి మరకలు చోటుచేసుకున్న సందర్భంగా చేస్తున్న తనిఖీలు సోదాలు అధికారులకు ప్రశ్నిస్తున్న తరుణంలో మీడియాకు సమాచారం ఇవ్వడానికి ఫోటోలు సేకరించడానికి నిరాకరిస్తూ మీడియాకు అనుమతి లేదని వరంగల్ దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వాగ్వాదానికి దిగారు. మీడియా ప్రతినిధులు పదే పదే ప్రశ్నించగా అవినీతిపై ఆరోపణలు చేసిన తనిఖీ నివేదికను రాష్ట్ర కమిషనర్‌కు అందజేస్తామని బృందం అధిపతి శ్రీకాంతారావు మీడియాతో పేర్కొన్నారు.