Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్
నవతెలంగాణ-నల్లగొండ
రవాణా రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ. శ్రీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రవాణా రంగ కార్మికుల జిల్లా జనరల్ బాడీ సమావేశం భీమగాని గణేష్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరైన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో15 లక్షల మంది కార్మికులు రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధిని రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న రంగాలలో రవాణా రంగం ప్రధానమని ఇంత కీలకమైన రంగంలో పనిచేస్తున్న కార్మికులకు మాత్రం భద్రత లేని బతుకులు, చాలీచాలని వేతనాలతో గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. లారీ, జీపు, కారు, ఆటో ప్రైవేట్ స్కూల్ బస్, అంబులెన్స్, హార్వెస్టర్ రోలర్, హిటాచి, తదితర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి ప్రమాద బీమా,పెన్షన్, పిఎఫ్, ఈఎస్ఐ,బ్యాంకు రుణాల లాంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసుల ఆర్టీవోల వేధింపులు ఎక్కువయ్యాయని, ఫైనాన్స్ వడ్డీ వ్యాపారులు కార్మికులను వేధిస్తున్నారని ఈ సమస్యలపై రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశ అనంతరం జిల్లా నూతన కమిటీ 25 మందితో ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పెంజర్ల సైదులు, చినపాక లక్ష్మీనారాయణ, యూనియన్ నాయకులు సత్యనారాయణ, అద్దంకి నరసింహ, ఎన్. సతీష్, నూకల జలంధర్, ఎస్.కె. రఫీ, నిరసనమెట్ల వెంకన్న, హనుమంత్ నాయక్, మంద సామెల్, జానీ, రాచమల్ల వెంకన్న, పగడాల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.