Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జయంతి, వర్థంతిలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
- డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్
నవతెలంగాణ-నల్లగొండ
దేశ స్వాతంత్య్రం కోసం అతి చిన్న వయసులోనే ఉరి కంభాన్ని ముద్దాడిన మహనీయుడు షాహిద్ భగత్‌సింగ్ అని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్లో భగత్‌సింగ్ 115 వ జయంతిని పురష్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్ స్ఫూర్తితో యువజన వ్యతిరేక విధానాలపై పోరాటం నిర్వహిస్తున్నామన్నారు. భగత్‌సింగ్ అందించిన స్ఫూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా అందరూ ఉద్యమించాలన్నారు. భగత్ సింగ్ జయంతి వర్ధంతిలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిం చాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు అన్నిటిని భర్తీ చేయాలన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు డబ్బికారి మల్లేశం, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, కందాల ప్రమీల, పాలడుగు ప్రభావతి, దండంపల్లి సత్తయ్య, నాంపల్లి చంద్రమౌళి, పోలబోయిన వరలక్ష్మి, తుమ్మల పద్మ, కొండాఅనురాధ, జిట్ట సరోజ, మంగారెడ్డి, కొండేటి శ్రీను, చౌగాని సీతారాములు, అవిశెట్టి శంకరయ్య, జిట్టా నాగేష్, పతాని శ్రీను, వినోద్ నాయక్, రాచకొండ వెంకన్న, పాదురు శశిధర్ రెడ్డి, రామ్మూర్తి, అవుట సైదులు, శివ తదితరులు పాల్గొన్నారు.