Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
నిర్మాణం పూర్తై సుమారు ఏడాది కావొస్తున్నా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిరుపేదలకు పంపిణీకి నోచని పరిస్థితి మండల పరిధిలోని చిల్పకుంట్లలో ఉన్నది.తుంగతుర్తి శాసనసభ సభ్యుడు గాదరి కిషోర్‌కుమార్,స్థానిక జెడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి గత ఎన్నికలలో గ్రామానికి ఇచ్చిన హామీలలో భాగంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వ నిధులు వచ్చే నిర్మాణం పూర్తి చేశారు.సదరు కాంట్రాక్టర్ 30 ఇండ్ల నిర్మాణం చేపట్టి వాటికి కలర్లో విద్యుత్ డోర్లతో సహా సంపూర్తిగా నిర్మాణం చేపట్టారు. కేవలం కనెక్షన్ ఇచ్చి గృహప్రవేశం చేసే అంత పూర్తిగా నిర్మాణమై ఏడాది దాటినా పంపిణీ చేయకపోవడంతో పశువులు, గొర్రెలు,ఇతర జంతువులకు నివాసంగా మారుతూ అసాంఘిక కార్యకలాలపాలకు నిలయంగా మారుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
జాప్యంచేస్తే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పంపిణీ చేస్తాం
సీపీఐ(ఎం) మండలకార్యదర్శి కందాల శంకర్‌రెడ్డి
ఇండ్ల నిర్మాణం పూర్తైన తర్వాత లబ్దిదారులకు పంపిణీలో జాప్యమవుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి లబ్దిదారులను ఎంపిక చేసి ఇండ్లను పంపిణీ చేయాలి.లేనిపక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఇండ్ల పంపకం చేపడ్తాం.